63 శాతం రేటుతో.. ఏపీలో నెల రోజుల్లో 1.39 లక్షల మంది రికవరీ..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత నెల రోజుల్లో

63 శాతం రేటుతో.. ఏపీలో నెల రోజుల్లో 1.39 లక్షల మంది రికవరీ..!
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 3:14 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు ఈ మహమ్మారి కట్టకు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత నెల రోజుల్లో 1.39 లక్షల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన 2.44 లక్షల పాజిటివ్‌ కేసుల్లో ఇప్పటి వరకు 1.54 లక్షల మంది రికవరీ అయినట్లు వైద్యారోగ్యశాఖ బుధవారం ట్విటర్‌లో తెలిపింది. ప్రస్తుతం 87,597 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఐసీఎంఆర్‌ గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా ఏపీలో కరోనా టెస్టులు జరుగుతున్నాయి. మిలియన్‌ జనాభాకు 48,551 టెస్టులు చేస్తున్నారు. తాజాగా ఏపీ‌లో రికవరీ రేటు 63.28 శాతంగా నమోదయింది. మొన్నటివరకూ ఇది 50 నుంచి 55 శాతం మధ్య ఉండేది. మంగళవారం ఒక్కరోజే 9,113 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దూకుడు కొనసాగిస్తోంది. మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో 25,92,619 టెస్టులు చేశారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు