AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona India: దేశంలో కరోనా విలయం.. 9 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 28,701 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 500 మరణాలు సంభవించాయి.

Corona India: దేశంలో కరోనా విలయం.. 9 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు..
Ravi Kiran
|

Updated on: Jul 13, 2020 | 10:04 AM

Share

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 28,701 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 500 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,254కి చేరుకుంది. ఇందులో 3,01,609 యాక్టివ్ కేసులు ఉండగా.. 23,174 మంది కరోనాతో మరణించారు. అటు 5,53,471 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుతో సహా 8 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ లిస్టులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల యాభై వేలు దాటగా.. వైరస్ కారణంగా 10,289 మంది మరణించారు. ఇక తమిళనాడులో లక్షా 38 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1966 మరణాలు సంభవించాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో 1,12,494 కేసులు, 3371 మరణాలు సంభవించాయి. ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులలో సంభవించాయి.

Also Read:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!