AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్‌ని ఒక్క ఛాన్స్ ఇవ్వ‌మ‌న్న బాలీవుడ్ ఫేమ‌స్ డైర‌క్ట‌ర్‌..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాట‌ల మాంత్రికుడు ద‌ర్మ‌క‌త్వంలో వ‌చ్చిన‌ సినిమా 'అల వైకుంఠ‌పుర‌ములో'. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన‌ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లోనే మంచి కలెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది ఈ సినిమానే. ఇక ఈ సినిమాకి సంబంధించిన పాట‌లు అయితే..

అల్లు అర్జున్‌ని ఒక్క ఛాన్స్ ఇవ్వ‌మ‌న్న బాలీవుడ్ ఫేమ‌స్ డైర‌క్ట‌ర్‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 13, 2020 | 9:52 AM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాట‌ల మాంత్రికుడు ద‌ర్మ‌క‌త్వంలో వ‌చ్చిన‌ సినిమా ‘అల వైకుంఠ‌పుర‌ములో’. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన‌ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లోనే మంచి కలెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది ఈ సినిమానే. ఇక ఈ సినిమాకి సంబంధించిన పాట‌లు అయితే మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేశాయ‌నే చెప్పాలి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. తాజాగా ఈ సినిమాను చూసిన ఓ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అంతేకాదు ఆయ‌న‌కో ఛాన్స్ ఇవ్వ‌మంటూ అడిగారు కూడా. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు అనుకుంటున్నారా?

బాలీవుడ్ ఫేమ‌స్ డైరెక్ట‌ర్ సంజ‌య్ గుప్తా. ఆయ‌న గురించి అంద‌రికీ తెలుసు. ‘కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, జ‌బ్బా’ వంటి సినిమాల‌తో అక్క‌డ డైరెక్ట‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చూసిన ఆయ‌న.. బ‌న్నీ గురించి, ఆ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు.

‘లేటెస్ట్‌గా మీ సినిమాను నెట్ ఫ్లిక్స్‌లో చూశాను. ఈ మూవీ బిగ్ స్క్రీన్‌పై చూడ‌క‌పోతే.. ఆ లోటు ఎప్ప‌టికీ ఉండిపోతుంది. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల‌న్నీ కుదుట‌ప‌డ్డాక‌, వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాలి’.. అంటూ సంజ‌య్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన బ‌న్నీ.. ‘ఈ సినిమా మీరు చూడ‌టం చాలా ఆనందంగా ఉంది. సినిమాను చూసిన మీకు థాంక్స్’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి మ‌ళ్లీ డైరెక్ట‌ర్ సంజ‌య్.. ‘బ్ర‌ద‌ర్.. మీ యాక్టింగ్‌కి నేను ఎలా క‌నెక్ట్ అయ్యానో వ‌ర్ణించ‌లేను. మీరు న‌న్ను న‌వ్వించారు.. ఏడిపించారు. మీకు నేను ఫ్యాన్‌గా మారిపోతున్నాను. మీతో వ‌ర్క్ చేయ‌డానికి ఒక్క అవ‌కాశం కోసం వెయిట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. దీనికి బ‌న్నీ ఎలాంటి ఆన్స‌ర్ ఇస్తాడో చూడాలి.

Read More: బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు క‌రోనా..

Follow Us
బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు!
బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు!
రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. కట్ చేస్తే
రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. కట్ చేస్తే
ఇంటి రహస్యం తెలిసిన వారే దొంగలు.. అసలు నిందితులు ఎవరో తెలుసా?
ఇంటి రహస్యం తెలిసిన వారే దొంగలు.. అసలు నిందితులు ఎవరో తెలుసా?
నెయ్యి + తమలపాకు కాంబినేషన్.. ఆ సమస్యలకు చెక్‌పెట్టే రామబాణం..!
నెయ్యి + తమలపాకు కాంబినేషన్.. ఆ సమస్యలకు చెక్‌పెట్టే రామబాణం..!
ఏలూరు జిల్లాలో విషాదం.. ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి
ఏలూరు జిల్లాలో విషాదం.. ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి లేచి ఒంటిచేత్తో
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి లేచి ఒంటిచేత్తో
బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా:
బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా:
రోగాలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత ఫలం.. కనిపిస్తే వదలకండి..లాభాలు
రోగాలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత ఫలం.. కనిపిస్తే వదలకండి..లాభాలు
వాడిని క్షమించను.. నమ్మి ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు
వాడిని క్షమించను.. నమ్మి ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి?