Covid19: దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఏమాత్రం తగ్గని మరణాల సంఖ్య

దేశంలో గత కొన్ని రోజులుగా దడపుట్టిస్తున్న కరోనా వైరస్ మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతోంది. గ‌డిచిన24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి.

Covid19: దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఏమాత్రం తగ్గని మరణాల సంఖ్య
Follow us
Balaraju Goud

|

Updated on: May 15, 2021 | 10:37 AM

India Coronavirus Cases: దేశంలో గత కొన్ని రోజులుగా దడపుట్టిస్తున్న కరోనా వైరస్ మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతోంది. నిన్న 3.40 ల‌క్షల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా 3.26 ల‌క్షల‌కు దిగివచ్చాయి. అయితే మృతుల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలావుంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 36,73,802 కేసులతో యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు దేశంలో కరోనా మహమ్మారి బారినపడి 2,66,207 మంది బాధితులు ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్పటివ‌ర‌కు కొత్తగా 3,53,299 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు, కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగంగా కొన‌సాగుతోంది. ఇప్పటివ‌ర‌కు 18,04,57,579 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామ‌ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, దేశంలో మొత్తం క‌రోనా ప‌రీక్షల సంఖ్య 31,30,17,193కు చేరింద‌ని భార‌తీయ‌ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్రక‌టించింది. నిన్న ఒకేరోజు 16,93,093 మందికి ప‌రీక్ష‌లు నిర్వహించామ‌ని వెల్ల‌డించింది.

Read Also…  Cyclone Tauktae: తీరంలో అలజడి.. భీకరంగా మారుతున్న తుఫాను.. బుసలు కొడుతున్న తౌక్తా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!