ఏపీలోని ఆ జిల్లాలో అత్యధిక కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,82,469 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిల్లో అత్యధిక కేసులు నాలుగు జిల్లాలలోనే ఉన్నాయి.

ఏపీలోని ఆ జిల్లాలో అత్యధిక కరోనా కేసులు..
Follow us

|

Updated on: Aug 27, 2020 | 12:13 AM

Corona Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,82,469 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిల్లో అత్యధిక కేసులు నాలుగు జిల్లాలలోనే ఉన్నాయి. అవే తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం. కరోనా టెస్టులు పెంచుతున్న కొద్దీ ఎక్కువగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అటు రాష్ట్రంలో 3541 మంది వైరస్ కారణంగా మరణించారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అనంతపురం, తూర్పు గోదావరి, కర్నూలు, గుంటూరు, జిల్లాలలోనే గత వారం రోజులుగా ప్రతీసారి అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీనితో స్థానిక పరిస్థితిని బట్టి అధికారులు మళ్లీ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రతీ రోజూ 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ జిల్లా హైరిస్క్ ప్రాంతంగా మారింది. ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్ లేకుండా బయటికి రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. అలాగే భౌతిక దూరాన్ని కూడా తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇక కొన్ని చోట్ల అయితే మరోసారి కఠిన లాక్ డౌన్‌ను విధిస్తున్నారు.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

కాగా, తూర్పుగోదావరిలో ఇప్పటివరకు 53,567 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 354 మంది మరణించారు. అలాగే అనంతపురంలో 36,948 పాజిటివ్ కేసులు, 299 మరణాలు సంభవించాయి. ఇక కర్నూలులో పాజిటివ్ కేసుల సంఖ్య 40845కు చేరగా.. 342 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. గుంటూరులో పాజిటివ్ కేసుల సంఖ్య 32,308కు చేరుకుంది. అటు వైరస్ కారణంగా 350 మంది చనిపోయారు. ఇక రాష్ట్రంలోని చిత్తూరు(360), తూర్పుగోదావరి(354), గుంటూరు(350), కర్నూలు(342), అనంతపురం(299) జిల్లాల్లో ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయి.

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా