తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా టెర్రర్ : ఏకంగా 4259 మందికి పాజిటివ్
తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు 4259 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.
Telangana Corona News : తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు 4259 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్‌లో పనిచేసే 1946 మంది పోలీసులకు కరోనా సోకింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనాతో 39 మంది పోలీసులు మృతి చెందారు. హైద్రాబాద్ కమీషనరేట్ లిమిట్స్‌లోనే 26 మంది వ్యాధి బారిన పడి మరణించడం గమనార్హం. హైద్రాబాద్ తర్వాత వరంగల్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో పోలీసులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు.
కాగా వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ముందుండి పనిచేస్తున్నారు పోలీసులు. ఫ్రంట్ వారియర్స్‌గా పనిచేస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో వారిపై కరోనా ప్రభావం అధికంగా ఉంది. కాగా పోలీసుల్లో మోరల్ సపోర్ట్ నింపేందుకు వ్యాధి బారిన పడి..రికవర్ అయిన వారిని ఘనంగా తిరిగి విధుల్లోకి ఆహ్వానిస్తున్నారు సహచర సిబ్బంది.
Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు