Corona India: దేశంలో కొత్తగా 27,071 కరోనా కేసులు, 336 మరణాలు.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య..

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,071 పాజిటివ్ కేసులు, 336 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 98,84,100కు చేరింది.

Corona India: దేశంలో కొత్తగా 27,071 కరోనా కేసులు, 336 మరణాలు.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య..
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 14, 2020 | 10:39 AM

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,071 పాజిటివ్ కేసులు, 336 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 98,84,100కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,52,586 ఉండగా.. ఇప్పటివరకు 93,88,159 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 336 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,43,355 మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన చోట్ల పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 30,695 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 8,55,157 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 15,45,66,990కు చేరింది. దేశంలో 94.93 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 3.62 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది.

Also Read:

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..

బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..