Corona Cases AP: ఏపీలో కొత్తగా 534 కరోనా కేసులు, 2 మరణాలు.. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతంటే..!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,821 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 534 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,821 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 534 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,77,348కి చేరింది. ఇందులో 4,454 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,65,825 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 7069కు చేరుకుంది. ఇక నిన్న 498 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,10,65,297 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 16, చిత్తూరు 130, తూర్పుగోదావరి 45, గుంటూరు 54, కడప 27, కృష్ణా 74, కర్నూలు 13, నెల్లూరు 21, ప్రకాశం 19, శ్రీకాకుళం 39, విశాఖపట్నం 31, విజయనగరం 14, పశ్చిమ గోదావరి 51 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Also Read:
బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్..!
పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు..
”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. వైరల్ ఫోటోలు..
ఏడుకొండలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమా..?

