ఢిల్లీలో పెరుగుతున్న కరోనా నెంబర్

మొత్తం కేసుల సంఖ్య 2,09,748కు చేరుకుంద‌ని రాష్ర్ట వైద్య‌, ఆరోగ్య శాఖ శుక్ర‌వారం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. ఇవాళ 2,754 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా ఇప్ప‌టివ‌ర‌కు 1,78,154 మంది రిక‌వ‌ర్ అయ్యారని....

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా నెంబర్
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 11, 2020 | 8:29 PM

Corona Cases in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతున్నట్లే తగ్గి మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులతో రాజధానివాసులు భయపడుతున్నారు. కేవలం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 4,266 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి.

కాగా మొత్తం కేసుల సంఖ్య 2,09,748కు చేరుకుంద‌ని రాష్ర్ట వైద్య‌, ఆరోగ్య శాఖ శుక్ర‌వారం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. ఇవాళ 2,754 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా ఇప్ప‌టివ‌ర‌కు 1,78,154 మంది రిక‌వ‌ర్ అయ్యారని వెల్లడించారు. తాజాగా 21 మంది క‌రోనాతో మృతి చెంద‌గా ఇప్ప‌టివ‌ర‌కు 4,687 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం 26,907 యాక్టీవ్ కేసులున్నాయి. అయితే వీకెండ్ సమయాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.