ఖాకీనే..క్రైమ్‌కు అల‌వాటుప‌డ్డాడు

ఈ కోవిడ్ వ్యాప్తి స‌మ‌యంలో పోలీసులు విధులు నిర్వ‌ర్తిస్తోన్న తీరును యావ‌త్ దేశం ప్ర‌శంసిస్తోంది. అయితే కొంద‌రు ఖాకీలు వారికి క‌ళంకం తెచ్చేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఖాకీనే..క్రైమ్‌కు అల‌వాటుప‌డ్డాడు
Follow us

|

Updated on: Aug 05, 2020 | 10:04 PM

ఈ కోవిడ్ వ్యాప్తి స‌మ‌యంలో పోలీసులు విధులు నిర్వ‌ర్తిస్తోన్న తీరును యావ‌త్ దేశం ప్ర‌శంసిస్తోంది. అయితే కొంద‌రు ఖాకీలు వారికి క‌ళంకం తెచ్చేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా అనంత‌పూర్ జిల్లాలోని పుట్లూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోన్న ఓ పోలీస్ ట్రాక్ త‌ప్పాడు. వ్య‌స‌నాల‌కు బానిసై చేతికి అందిన అప్పులు చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా అద్దెకు తీసుకున్న కార్ల‌ను సైతం తాక‌ట్టు పెట్టాడు. బాధితులు ఫిర్యాదుతో కిలాడీ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే… పుట్లూరు పీఎస్‌లో కానిస్టేబుల్‌గా వ‌ర్క్ చేస్తోన్న‌ వెంకటరమేష్‌ జూదానికి బానిసై అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం కార్లను రెంట్‌కు తీసుకుని వాటిని తాకట్టు పెట్టాడు‌. ఇలా 20 కార్లను రోజువారీ అద్దెకు తీసుకుని ఎవ‌రికీ తెలియ‌కుండా తాకట్టు పెట్టి జూదం ఆడాడు. అయితే అద్దెకు తీసుకున్న కార్లకు ప్ర‌తి రోజూ అద్దె పే చెయ్య‌కపోవ‌డంతో వారు కార్లను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో తాను పోలీస్‌ను అంటూ బెదిరిస్తుండ‌టంతో.. బాధితులు జూలై 20వ తేదీన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు‌ని అదుపులోకి తీసుకున్నారు. రూ. 45 లక్షలా 57 వేల రూపాయలకు కార్లను కుదువ పెట్టిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపిన‌ట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే బాధితులకు వారి కార్లను అంద‌జేస్తామ‌ని చెప్పారు.