AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగుళూరును అంత మాట అంటారా ? తేజస్వి సూర్యపై కాంగ్రెస్ ఫైర్

బెంగుళూరు నగరం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందంటూ బీజేపీ యువజన విభాగం కొత్త చీఫ్ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇందుకు ఆయనను ఈ పదవి నుంచి తొలగించాలని..

బెంగుళూరును అంత మాట అంటారా ? తేజస్వి సూర్యపై కాంగ్రెస్ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 28, 2020 | 3:50 PM

Share

బెంగుళూరు నగరం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందంటూ బీజేపీ యువజన విభాగం కొత్త చీఫ్ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇందుకు ఆయనను ఈ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. తేజస్వి ఈ నగరాన్ని ‘హతమారుస్తున్నారని’, ఇది ఈ సిటీకీ, బీజేపీకి కూడా సిగ్గుచేటని కర్ణాటకలో విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. అయితే సీఎం ఎడ్యూరప్ప మాత్రం తేజస్వి వ్యాఖ్యలను సమర్థించారు. నిజానికి ఈ సిటీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ని ఏర్పాటు చేయాలని కొంతకాలంగా తాను ప్రధానిని కోరుతున్నానని అన్నారు. తేజస్వి మాటల్లో తప్పేముంది అన్నారు.