పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

కమెడియన్ అలీ పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Updated On - 5:44 pm, Wed, 15 July 20
పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

Ali Praises Pawan Kalyan: సినిమాల పరంగానూ.. వ్యక్తిగతంగానూ.. పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే గత ఎన్నికల్లో అలీ.. పవన్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. కాగా, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో.. ఫ్యాన్స్ గత రెండు రోజుల నుంచి #PSPKAdvBdayTrendOnJuly13th అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కమెడియన్ అలీ పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

”వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు, నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు… ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు…@Pawankalyan” అంటూ అలీ పవన్‌పై పొగడ్తలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌పై జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్‌ను ఉద్దేశించి మీరన్న మాటలను మర్చిపోలేం అంటూ అలీపై ఫైర్ అవుతున్నారు.

Also Read: సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..