తెలంగాణ రైతు వేదికల ప్రారంభోత్సవ సంబురం.. కొడకండ్ల నుంచి లైవ్

తెలంగాణలో పల్లె ప్రగతి సాధించిన ఫలాలతో గ్రామాల రూపురేఖలు మారాయి. ఇకిప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్‌. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టింది. దాంతోపాటు రైతు వేదికలను ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక రైతు వేదికను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో రైతు వేదికకు 22 లక్షల చొప్పున…సుమారు 2 వేల 604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణానికి మొత్తం 573 కోట్లు ఖర్చుచేస్తోంది. రైతులు, అధికారులు, […]

తెలంగాణ రైతు వేదికల ప్రారంభోత్సవ సంబురం.. కొడకండ్ల నుంచి లైవ్
Venkata Narayana

|

Oct 31, 2020 | 12:05 PM

తెలంగాణలో పల్లె ప్రగతి సాధించిన ఫలాలతో గ్రామాల రూపురేఖలు మారాయి. ఇకిప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్‌. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టింది. దాంతోపాటు రైతు వేదికలను ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక రైతు వేదికను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో రైతు వేదికకు 22 లక్షల చొప్పున…సుమారు 2 వేల 604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణానికి మొత్తం 573 కోట్లు ఖర్చుచేస్తోంది. రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు సమావేశం అయ్యేలా రైతు వేదికలు పనిచేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో ప్రారంభిస్తున్నారు. ఆ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడొచ్చు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu