AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telanagana CM KCR: వృద్ధునిపై కేసీఆర్ ఔదార్యం

రోడ్డుమీద కనిపించిన ఓ ముస్లిం వృద్ధుని పట్ల ఔదార్యం ప్రదర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. దారిలో కనిపించిన వృద్ధుని కష్టం విని వెంటనే స్పందించారు. ఆ వృద్ధునికి సాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Telanagana CM KCR:  వృద్ధునిపై కేసీఆర్ ఔదార్యం
Rajesh Sharma
| Edited By: |

Updated on: Feb 27, 2020 | 9:31 PM

Share

Chief Minister KCR’s generosity for old man: వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం ఈ ఉదంతం జరిగింది. కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆ వృద్ధుని సమస్యను తృటిలో పరిష్కరించారు. అతని కుటుంబానికి చేయూతనందించేందుకు రంగంలోకి దిగారు.

గురువారం మద్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు ఆపి కిందకు దిగారు. వృద్ధుని దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మహ్మద్ సలీమ్ గా పరిచయం చేసుకున్న ఆ వృద్ధుడు, గతంలో డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాని చెప్పుకున్నాడు.

నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడడంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని, ఉండడడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని కోరాడు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read this: New Scheme on the name of CM KCR సీఎం కేసీఆర్ పేరిట కొత్త పథకం

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టోలి చౌకిలో సలీమ్ నివాసముంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపారు. సలీమ్ వికలాంగుడని దృవీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్ కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సిఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. కేసీఆర్ ఔదార్యంపై ఆ ముస్లిం కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

Read this: Smile program on the name of late YSR వైఎస్ఆర్ పేరిట చిరునవ్వు కార్యక్రమం