YSR Chirunavvu: ఏపీలో విలేజ్ క్లినిక్స్… వైఎస్సార్ పేరుతో చిరునవ్వు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఏపీలో కొత్త పథకానికి రూపకల్పన జరిగింది. వైఎస్ఆర్ జయంతి అయిన జులై 8వ తేదీన దాన్ని లాంచ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

YSR Chirunavvu: ఏపీలో విలేజ్ క్లినిక్స్... వైఎస్సార్ పేరుతో చిరునవ్వు
Follow us

|

Updated on: Feb 27, 2020 | 7:13 PM

AP Government to launch YSR Chirunavvu: ఏపీలో ఇక గ్రామ వైద్యశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రామ వైద్యశాలలు రెఫరల్ ఆస్పత్రులుగా వుండేలా పథకాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ప్రతీ రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ 24 గంటలు తెరిచి వుంచేలా ప్లాన్ చేస్తుండడవ విశేషం.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం నాడు ఆరోగ్యశాఖపై సమీక్ష జరిపారు. ప్రతీ రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్ధితులకు తగినట్లుగా విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉండాలే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ప్రోగ్రామ్‌కు తుది మెరుగులు దిద్దారు. వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లో 24 గంటలపాటు ఒక బియస్సీ నర్సింగ్‌ చదివిన నర్సింగ్‌ స్టాఫ్‌ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.

గ్రామ సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉండాలన్నారు ముఖ్యమంత్రి. విలేజ్‌ క్లినిక్‌ రెఫరల్‌ పాయింట్‌లా ఉండాలని, రోగి ఎవరొచ్చినా క్లినిక్‌ రెఫరల్‌ పాయింట్‌లా పనిచేయాలని సీఎం సూచించారు. డబ్బు ఖర్చు కాకుండా వైద్యం ఉచితంగా అందే విధంగా ప్రక్రియ వుండాలన్నారు. బేసిక్‌ మెడికేషన్‌ ఇవ్వడమే లక్ష్యంగా విలేజ్ క్లినిక్స్ పని చేయాలని చెప్పారు.

ప్రతీ జిల్లాకు ఒక టీచింగ్‌ హస్పిటల్‌ ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ సేవలుండాలని చెప్పారు సీఎం. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 25 టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఉండాలే ప్లాన్ చేయాలని ఆదేశించారు. 7 మెడికల్‌ కాలేజీలకు డిపిఆర్‌లు సిద్దమవుతున్నాయని, ప్రతి టీచింగ్‌ హాస్పిటల్‌లో డెంటల్‌ ఎడ్యుకేషన్‌ కూడా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

“డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ చిరునవ్వు”

జులై 8 దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీవ్యాప్తంగా డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగి నుంచి 6వ తరగతి చదివే విద్యార్ధులకు ఉచిత దంత వైద్యం అందించేందుకు చిరునవ్వు స్కీమ్ ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతీ విద్యార్దికి టూత్‌పేస్ట్, బ్రష్‌ ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెబుతున్నారు. పిహెచ్‌సీలలో డెంటల్‌ చెకప్‌ కూడా ఉండాలని, 60 లక్షల మంది చిన్నారులను స్క్రీనింగ్‌ చేయడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

Read this: New scheme on the name of KCR కేసీఆర్ పేరుతో కొత్త స్కీమ్