AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ వద్దంది.. ఆంధ్రా అక్కున చేర్చుకుంది..

అధికారం చేపట్టింది తొలిసారే.. కానీ పరిపాలనలో మాత్రం తన ప్రత్యేక మార్క్‌ను చూపిస్తూ ఇప్పటికే ఎన్నో సంచనాలకు తెరతీసిన ముఖ్యమంత్రి జగన్. తెలంగాణ ప్రభుత్వం తమకు వద్దనుకుని పక్కన పెట్టేసిన ఓ ఐఏఎస్ అధికారికి సముచిత స్ధానం కల్పించి ఓ ఉన్నత పదవిని సైతం కట్టబెట్టారు సీఎం జగన్. తెలంగాణలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని పాఠశఆల విద్య మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ […]

తెలంగాణ వద్దంది.. ఆంధ్రా అక్కున చేర్చుకుంది..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 05, 2019 | 5:32 PM

Share

అధికారం చేపట్టింది తొలిసారే.. కానీ పరిపాలనలో మాత్రం తన ప్రత్యేక మార్క్‌ను చూపిస్తూ ఇప్పటికే ఎన్నో సంచనాలకు తెరతీసిన ముఖ్యమంత్రి జగన్. తెలంగాణ ప్రభుత్వం తమకు వద్దనుకుని పక్కన పెట్టేసిన ఓ ఐఏఎస్ అధికారికి సముచిత స్ధానం కల్పించి ఓ ఉన్నత పదవిని సైతం కట్టబెట్టారు సీఎం జగన్. తెలంగాణలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని పాఠశఆల విద్య మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో కూడా జారీ చేశారు.

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి విధులు నిర్వహించారు. అదే సమయంలో ఆయన ప్రభుత్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను స్టేట్ ఆర్కివ్స్ సంచాలకుడిగా బదిలీ చేశారు. దీంతో ఆయన తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందంటూ ఘాటైన విమర్శలు సైతం చేశారు. ప్రభుత్వ వైఖరి పట్ల మురళి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దళితుడైన తనకు అంతంగా ప్రాధన్యత లేని శాఖను కేటాయించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో తీవ్రమై ఒత్తిడికి గురైన ఆయన తన పదవీ విరమణకు మరో 10 నెలలు సమయం ఉండగానే జూలై 27న తనకు వాలంటరీ రిటైర్‌మెంట్ కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా గత నెల 16న ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. ఆమోద ముద్ర పడిన రెండు వారాలకే ఏపీ ప్రభుత్వం మురళికి మంచి పదవిని కట్టబెట్టడంపై సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతుంది.

తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు

ఆకునూరి మురళి ముక్కసూటి మనిషిగా పేరున్న అధికారి. సామాజిక బాధ్యత గల మంచి వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో కొన్నివివాదాస్పద విషయాల్లో తాను చెప్పాలనుకున్నది చెప్పడం ఆయనకు అలవాటు. దీనికి ఉదాహరణే 2017లో బీఫ్ మాంసంపై చేసిన వ్యాఖ్యలు. దీన్ని నిషేదించడం పనికిమాలిన చర్యగా మురళి పేర్కొన్నారు. దీనికి ఒక సామాజికవర్గమే కారణమని కూడా ఆరోపించి వివాదానికి కారణమయ్యారు. అయితే వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తెలంగాణలో కొన్ని వర్గాల వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని మురళి ఆరోపించారు. తాను ప్రభుత్వ వైఖరికి నిరసనగానే వీఆర్ఎస్ తీసుకుంటున్నానని, ఐఏఎస్ పోస్టుల్లో దళితుల పట్ల వివక్ష కొనసాగుతుందనే దానికి తానే నిదర్శనమన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల మాట ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఇది ఎక్కువగానే ఉందంటూ మురళి ఆరోపించారు. భూపలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్న తనను పనిలేని శాఖలో పోస్టింగ్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తూ.. ఇక్కడ ఖాళీగా కూర్చుని జీతం తీసుకుంటున్నాను అనే భావన కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగం చేయడం కంటే పక్కకు తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకునే స్వచ్ఛంద విరమణ చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే విరమణ తర్వాత తనకు ఇష్టమైన విద్యారంగంలో సేవచేస్తానని కూడా ప్రకటించారు. తాజగా ఏపీ ప్రభుత్వం .. ఆకునూరి మురళిలోని నిజాయితీని గుర్తించి. ఆయనకు ఇష్టమైన విద్యారంగంలోనే పోస్టింగ్ ఇచ్చి గొప్పదనాన్ని చాటుకుంది.