మిల‌మిల‌ మెరిసే మంచు ఖండం.. ఇప్పుడు ఆకుపచ్చగా..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పర్యావరణానికి మాత్రం ఏంతో మేలు జరిగింది. ఈ క్రమంలో

  • Tv9 Telugu
  • Publish Date - 4:14 pm, Fri, 22 May 20
మిల‌మిల‌ మెరిసే మంచు ఖండం.. ఇప్పుడు ఆకుపచ్చగా..

Antarctica’s snow to turn green: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పర్యావరణానికి మాత్రం ఏంతో మేలు జరిగింది. ఈ క్రమంలో మిల‌మిల‌ మెరిసే మంచు ఖండం అంటార్కిటికా.. మెల్ల‌మెల్ల‌గా ప‌చ్చ‌ని ప్ర‌దేశంగా మారుతున్న‌ది. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల ఆ హిమ‌ ఖండంలో శైవ‌లాల ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. తెల్ల‌టి మంచు లోకంలో.. ఆకుప‌చ్చ ఆల్గే ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్న‌ట్లు తాజాగా ఓ స‌ర్వే పేర్కొంది.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావ‌ర‌ణం వేడెక్కి అంటార్కిటికాలో చిన్న చిన్న మొక్క‌లు చిగురిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విస్తార‌మైన ఆ ఖండంలో మొలుస్తున్న ఆల్గేతో .. మంచు గ‌డ్డ‌ల‌న్నీ అంద‌మైన ప్రాంతాలుగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అంటార్కిటికాలో ఆల్గే ఉన్న‌ట్లు గ‌తంలో బ్రిటీష్ అన్వేష‌కుడు ఎర్నెస్ట్ షాక‌ల్ట‌న్ గుర్తించారు. యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ సెంటిన‌ల్ 2 శాటిలైట్‌తో పాటు కేంబ్రిడ్జ్ వ‌ర్సిటీ, బ్రిటీష్ అంటార్కిటికా స‌ర్వే ప‌రిశోధ‌కులు.. అంటార్కిటికాలో ఉన్న శైవ‌లాల ఆన‌వాళ్ల‌కు సంబంధించిన మ్యాప్‌ను త‌యారు చేశారు.

ఈ అతి శీతల మంచు ఖండంలో ఆల్గే సుమారు 1679 చోట్ల విక‌సించిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. కార్బ‌న్ ఉద్గ‌రాలు ఎంత‌గా విడుద‌ల అవుతున్నాయో.. అంత త్వ‌ర‌గా అంటార్కిటికాలో శైవ‌లాల ఎదుగుద‌ల క‌నిపిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. సుమారు 8.75 ల‌క్ష‌ల పెట్రోల్ కార్లు విడుద‌ల చేసే కార్బ‌న్ ఉద్గ‌రాల‌తో స‌మానంగా అంటార్కిటికా ఆల్గేలు ఉన్న‌ట్లు కేంబ్రిడ్జ్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ మాట్ డ‌వే తెలిపారు. ఎరుపు, నారింజ రంగు శైవ‌లాల గురించి కూడా స్ట‌డీ చేస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

Also Read: త్వరలో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ..