త్వరలో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ..

రాష్ట్రంలో పంచాయితీ కార్యదర్శి పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఆదేశించారు.

త్వరలో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ..
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 10:23 AM

Panchayat Secretary: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు వారం రోజుల్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 2,000లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ. 5 వేలు జీతం లభిస్తోంది.

కాగా.. పంచాయితీ కార్యదర్శి విధిగా.. గ్రామపంచాయితీకి చెందిన అందరు అధికారులూ, సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉంటాడు. సర్పంచ్‌ యొక్క ఆదేశంతో గ్రామపంచాయతీ సమావేశాలను నెలకు ఒక్కసారైనా నిర్వహించాలి. గత సమావేశం జరిగిన నాటి నుంచి 90 రోజుల గడువులోపు మరో సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీనికి సర్పంచ్‌ ఆమోదం తెలియజేయకపోతే కార్యదర్శి తనంతట తానే సమావేశం నిర్వహించవచ్చు.