కొత్తపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ప్రజాభిప్రాయసేకరణలో గందరగోళం

ప్రకాశంజిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఇవాళ అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళం నెలకొంది. కొంతమంది మత్స్యకారులు హార్బర్‌ ఏర్పాటు విషయంలో అధికారులు స్పష్టమైన వివరాలు చెప్పడం లేదంటూ ఆందోళనకు దిగారు. మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయి నినాదాలు చేసుకున్నారు. హార్బర్‌ను వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు సభ నుంచి లేచి పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ సందర్బంగా సభలో గందరగోళం నెలకొంది. హార్బర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన మత్స్యకారులకు […]

కొత్తపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ప్రజాభిప్రాయసేకరణలో గందరగోళం
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 17, 2020 | 2:14 PM

ప్రకాశంజిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఇవాళ అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళం నెలకొంది. కొంతమంది మత్స్యకారులు హార్బర్‌ ఏర్పాటు విషయంలో అధికారులు స్పష్టమైన వివరాలు చెప్పడం లేదంటూ ఆందోళనకు దిగారు. మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయి నినాదాలు చేసుకున్నారు. హార్బర్‌ను వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు సభ నుంచి లేచి పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ సందర్బంగా సభలో గందరగోళం నెలకొంది. హార్బర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన మత్స్యకారులకు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సభ రసాభాసగా మారింది. సభలో నెలకొన్న గందరగోళంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు స్పష్టమైన వివరాలు అందించాలని, భూ సేకరణ చేసే సమయంలో గ్రామస్థులంతా సమ్మతిస్తేనే భూమిని సేకరించాలని కొందరు మత్స్యకారులు కోరారు.