మాజీ ఎమ్మెల్యే ఆమంచి నోరు నొక్కిన మహిళా ఎస్పీ..!

జ‌డ్జిల‌పై వివాదస్పద కామెంట్స్ చేసిన అధికార వైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టు గట్టి షాక్ విష‌యం తెలిసిందే. న్యాయమూర్తులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై, పోస్టులపై ఓ లాయ‌ర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తీర్పులపై సోషల్‌ మీడియా, మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యల్ని క్షుణ్నంగా పరిశీలించిన ధ‌ర్మాస‌నం వారందరికీ నోటీసులు జారీ చేసింది. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేయ‌గా..వారిలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌‌తో పాటు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ […]

మాజీ ఎమ్మెల్యే ఆమంచి నోరు నొక్కిన మహిళా ఎస్పీ..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 28, 2020 | 9:17 AM

జ‌డ్జిల‌పై వివాదస్పద కామెంట్స్ చేసిన అధికార వైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టు గట్టి షాక్ విష‌యం తెలిసిందే. న్యాయమూర్తులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై, పోస్టులపై ఓ లాయ‌ర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తీర్పులపై సోషల్‌ మీడియా, మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యల్ని క్షుణ్నంగా పరిశీలించిన ధ‌ర్మాస‌నం వారందరికీ నోటీసులు జారీ చేసింది. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేయ‌గా..వారిలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌‌తో పాటు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. దీనిపై తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది కోర్టు. ఈ ఇష్యూపై బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ నిర్వ‌హించారు టీవీ9 మేనేజింగ్ ఎడిట‌ర్ రజినీకాంత్. ఈ క్ర‌మంలో కోర్టు పంపించిన నోటీసుల‌పై స్పందించాల్సిందిగా ఫోన్ కాల్ లో అందుబాటులోకి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే ఆమంచిని కోరారు ర‌జ‌నీకాంత్. అయితే తాను చేసే కామెంట్స్ గురించి ప్ర‌స్తావించ‌బోయారు ఆమంచి. వారించిన ర‌జ‌నీకాంత్ అది కోర్టు రూల్స్ కి విరుద్ద‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయినా ఆమంచి మాట్లాడ‌బోతుండ‌గా..చ‌ర్చ‌లో ఉన్న సీఐడీ మ‌హిళా ఎస్పీ రాధిక‌..కోర్టు ఇచ్చిన జ‌డ్జిమెంట్స్ గురించి మాట్లాడిన‌ప్పుడు ఏమైనా చిన్న అక్ష‌రం దొర్లినా అది కోర్టు తీర్పు ఉల్లంఘ‌న అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అటువంటి చ‌ర్చ‌లో తాను పాల్గొన్న‌బోన‌ని పేర్కొన్నారు. దీంతో ఆమంచి రియాక్ష‌న్ తీసుకోకుండానే ఆయ‌న ఫోన్ కాల్ ముగించారు ర‌జినీకాంత్.