AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sye Raa: చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. కానీ చరిత్ర మనతోనే..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను హీరో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజైన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేసింది యూనిట్. టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. రోమాలు నిక్కబొడిచేలా సైరా టీజర్‌ను కట్ చేసింది చిత్ర యూనిట్. స్వాతంత్య్ర […]

Sye Raa: చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. కానీ చరిత్ర మనతోనే..
Ravi Kiran
|

Updated on: Aug 20, 2019 | 3:43 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను హీరో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజైన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేసింది యూనిట్.

టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. రోమాలు నిక్కబొడిచేలా సైరా టీజర్‌ను కట్ చేసింది చిత్ర యూనిట్. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయి నటించారు. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. చిరంజీవి ఎంట్రీ, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ వాయిస్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు, తమన్నా వంటి టాప్ స్టార్లు నటిస్తున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తర్వాత మెగాస్టార్ ఫ్యాన్స్‌కు ఇది ఒక విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి.