చైనీస్ కంపెనీకి ఐపిఎల్ స్పాన్సర్ షిప్, ఒమర్ అబ్దుల్లా మండిపాటు

ఓ వైపు చైనా వస్తువులను, ప్రాడక్టులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తుంటారని, కానీ మరోవైపు చైనీస్ మొబైల్ కంపెనీ..’వీవో’ సహా ఇతర స్పాన్సర్స్ అందరినీ కొనసాగించాలని ఐ పీ ఎల్ గవర్ణింగ్ కౌన్సిల్ నిర్ణయించడం ఏమిటని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వీవోను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా దళాలు మన భూభాగాల్లోకి చొరబడుతుంటే చైనీస్ కంపెనీలను స్పాన్సర్లుగా ఉంచాలన్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన కోరారు. ‘చైనీస్ […]

చైనీస్ కంపెనీకి ఐపిఎల్ స్పాన్సర్ షిప్, ఒమర్ అబ్దుల్లా మండిపాటు

ఓ వైపు చైనా వస్తువులను, ప్రాడక్టులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తుంటారని, కానీ మరోవైపు చైనీస్ మొబైల్ కంపెనీ..’వీవో’ సహా ఇతర స్పాన్సర్స్ అందరినీ కొనసాగించాలని ఐ పీ ఎల్ గవర్ణింగ్ కౌన్సిల్ నిర్ణయించడం ఏమిటని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వీవోను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా దళాలు మన భూభాగాల్లోకి చొరబడుతుంటే చైనీస్ కంపెనీలను స్పాన్సర్లుగా ఉంచాలన్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన కోరారు. ‘చైనీస్ మనీ, ఇన్వెస్ట్ మెంట్, స్పాన్సర్ షిప్, అడ్వర్టైజింగ్ విషయాలను ఎలా హ్యాండిల్ చేయాలన్న అంశంపై అయోమయం నెలకొంటోందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈ లో ఐపీఎల్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. చైనా కంపెనీల స్పాన్సర్  షిప్, యాడ్స్ లేకుండా మనం ఈ విధమైన ఈవెంట్స్ ని నిర్వహించలేమా అని అబ్దుల్లా ప్రశ్నించారు.

 

Click on your DTH Provider to Add TV9 Telugu