కరోనా ఎఫెక్ట్‌.. టీవీ యాంకర్‌ ఆత్మహత్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి సోకిన తరువాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలు పోయాయి. 

కరోనా ఎఫెక్ట్‌.. టీవీ యాంకర్‌ ఆత్మహత్య

TV Anchor Commits Suicide:ప్రపంచవ్యాప్తంగా కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి సోకిన తరువాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దీంతో పనిలేక ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందులో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇక తాజాగా ఓ 24 ఏళ్ల టీవీ యాంకర్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది.

ఢిల్లీలోని ఓ ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటోన్న ప్రియా జునీజా.. గత శుక్రవారం ఉదయం ఎంతసేపైనా బయటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు పగలగొట్టగా.. ప్రియా ఫ్యాన్‌కి ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది. కాగా పలు ఛానెళ్లలో న్యూస్‌ రీడర్‌గా, యాంకర్‌గా ప్రియా  పనిచేశారు. కరోనా నేపథ్యంలో ఆమె ఉద్యోగం పోగా, ఆ తరువాత యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించింది. అయితే దానికి అనుకున్నంత ప్రోగ్రెస్‌ లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ప్రియా, బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృతిపై సన్నిహితులు సంతాపం ప్రకటించారు.

Read This Story Also: తనయుడి కోసం కథ సిద్ధం చేస్తోన్న బాలయ్య!

 

Click on your DTH Provider to Add TV9 Telugu