AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా జలాల్లో భారత నౌకలు, చిక్కుబడిన ఇండియన్స్, ఆందోళన అక్కర్లేదన్న డ్రాగన్ కంట్రీ, పరిణామాలపై కేంద్ర దృష్టి

చైనాలోని హెబీ ప్రావిన్స్ రేవులో నిలిచి ఉన్న రెండు భారతీయ నౌకలు..ఎం వీ జగ్ ఆనంద్, ఎంవీ అనస్తేషియా ల్లో చిక్కుబడిన భారతీయుల క్షేమానికి ఢోకా లేదని చైనా ప్రకటించింది. ఈ నౌకల్లో..

చైనా జలాల్లో భారత నౌకలు, చిక్కుబడిన ఇండియన్స్, ఆందోళన అక్కర్లేదన్న డ్రాగన్ కంట్రీ, పరిణామాలపై కేంద్ర దృష్టి
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 26, 2020 | 12:27 PM

Share

చైనాలోని హెబీ ప్రావిన్స్ రేవులో నిలిచి ఉన్న రెండు భారతీయ నౌకలు..ఎం వీ జగ్ ఆనంద్, ఎంవీ అనస్తేషియా ల్లో చిక్కుబడిన భారతీయుల క్షేమానికి ఢోకా లేదని చైనా ప్రకటించింది. ఈ నౌకల్లో జూన్ 13 నుంచి మొత్తం 39 మంది ఇండియన్స్ ఉన్నారు. తమ నౌకలనుంచి సరకులను అన్ లోడ్ చేసేందుకు వీరిని చైనా ప్రభుత్వం అనుమతించడంలేదు. అయితే ఇండియా, ఆస్ట్రేలియా దేశాలతో క్షీణిస్తున్న తమ దేశ సంబంధాలకు, ఈ ఉదంతానికి సంబంధం లేదని చైనా ప్రభుత్వం వెల్లడించింది. ఇవి రెండూ కార్గో నౌకలే ! కొన్ని ఇతర నౌకల సిబ్బందికి వారి సరకులను దింపేందుకు చైనా అనుమతించినప్పటికీ..భారత నౌకలకు మాత్రం పర్మిషన్ లభించలేదు.  చైనా వైఖరితో మన దేశ సిబ్బంది ఆందోళన చెందుతున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. బీజింగ్ లో ఇండియన్ ఎంబసీతో తాము కాంటాక్ట్ లో ఉన్నామన్నారు. ఏమైనప్పటికీ భారత,  చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు, దీనికి సంబంధం లేదని, భారతీయ సిబ్బంది క్వారంటైన్ కండిషన్స్ పాటిస్తే సరిపోతుందని చైనా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ బీజింగ్ లో వెల్లడించారు.

క్వారంటైన్ షరతుల విషయంలో మా దేశం స్పష్టంగా నిబంధనలను పాటిస్తున్నట్టు ఆయన చెప్పారు. తూర్పు లడాఖ్ లో భారత. చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆ దేశ రేవులో చిక్కుబడిన భారతీయుల బాగోగులు, క్షేమంపై ఆందోళన తలెత్తడం సహజమే.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!