సూర్యాపేటలో అమానుషం.. ఫొటోకు చెప్పులదండవేసి కన్న తండ్రినే కిడ్నాప్ చేసిన కొడుకులు, విలవిల్లాడుతోన్న తల్లి

సూర్యాపేటలో అమానుషం.. ఫొటోకు చెప్పులదండవేసి కన్న తండ్రినే కిడ్నాప్ చేసిన కొడుకులు, విలవిల్లాడుతోన్న తల్లి

రోజు రోజుకి సమాజంలో మానవతా విలువలు మంట గలుస్తున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. అనుబంధాలను..

Venkata Narayana

|

Dec 15, 2020 | 10:36 AM

రోజు రోజుకి సమాజంలో మానవతా విలువలు మంట గలుస్తున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. అనుబంధాలను మరచి దేనికైనా బరితెగించి రాక్షసులుగా మనుషులు మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట భగత్ సింగ్ నగర్ లో రిటైర్డ్ ఎమ్మార్వో సంజీవరావు, సరోజ దంపతులు.. నాల్గొవ కుమారుడు కరుణాకర్ తో కలిసి ఉంటున్నారు. సంజీవ రావుకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగి హైద్రాబాద్ లో ఉండగా, పెద్ద కుమారుడు రవీందర్ సూర్యాపేటలోనే నివాసముంటూ సిద్దిపేట ఎల్ఐసి కార్యాలయంలో పని చేస్తున్నాడు. రెండవ కొడుకు మృతి చెందగా, మూడో కొడుకు దయకర్ మిర్యాలగూడలో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నాడు. సూర్యాపేటలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న చిన్న కొడుకు దగ్గర సంజీవరావు ఉంటున్నాడు.

చిన్న కొడుకుకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నాడు సంజీవరావు. కాగా తండ్రికి రామన్నపేటలో 5 ఎకరాల పొలం ఉంది. గత కొన్ని రోజులుగా పొలం తాలూకు ఆస్తి పంచాలంటూ కుమారులు రవీందర్, దయాకర్ లు గొడవలకు దిగుతున్నారు. అయితే, ఆస్తిని తమ తదనంతరం మాత్రమే పంచుకోవాలని సంజీవరావు చెప్పాడు. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న తమ తమ్ముడికి ఎక్కడ పొలం రాసి ఇస్తారోనని ఇద్దరు కొడుకులు అనుమానించారు. ఏకంగా ఇంట్లో ఉంటున్న తల్లిపై దాడి చేసి తండ్రిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న తండ్రి ఫోటోకు చెప్పుల దండ వేశారంటే తండ్రిపై ఎంత కోపం పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో తల్లి కన్నీరు మున్నీరుగా భర్తకోసం విలపిస్తోంది. తన ఇద్దరు కొడుకులు మందీ మార్బలంతో కార్లలో వచ్చి తన భర్తను ఎత్తుకెళ్లారని సరోజ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu