నిర్లక్ష్యంగా కారు నడిపిన యువకుడు.. చిన్నారి మృతి

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లో విగతజీవిగా మారింది

నిర్లక్ష్యంగా కారు నడిపిన యువకుడు.. చిన్నారి మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 27, 2020 | 7:17 PM

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లో విగతజీవిగా మారింది. యువకుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ సెల్లార్‌లో యువకుడు అజాగ్రత్తగా కారు నడిపి చిన్నారి చావుకు కారణమయ్యాడు. వచ్చిన డ్రైవింగ్ తో సెల్లార్ లో ఆడుకుంటున్న వాచ్‌మెన్ కూతురు మనిశ్వీపై నుంచి కారును తీసువెళ్లాడు. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే కన్నకూతురు కానరాని లోకాలకు పోవడంతో ఆ తల్లదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబందించి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.