AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు..

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్‌ చికెన్‌ రూ.25-50 లోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు

నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 10, 2020 | 3:36 PM

Share

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్‌ చికెన్‌ రూ.25-50 లోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు ఇచ్చినా తీసుకునేవారు లేరు. పెంపకం, మేత ఖర్చులు కూడా రాక రైతులు నష్టాలను చవిచూశారు. దీనివల్ల కొన్నిచోట్ల కోళ్లను మేపలేక మిన్నకుండిపోయారు. మరికొన్ని చోట్ల గొయ్యి తీసి పాతేశారు. ఈ పరిణామాలతో 60శాతం కోళ్ల ఫారాల్లో కోళ్లే లేకుండా పోయాయి. కొన్నిచోట్లే అరకొరగా మిగిలాయి. ఇంటిగ్రేషన్‌ కంపెనీలు కూడా కొత్త కోడిపిల్లల బ్యాచ్‌లను పెంచడం ఆపేశాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మాంసం ప్రియులు ఇపుడు మళ్లీ చికెన్‌పై పడ్డారు.

కాగా.. డిమాండ్‌ ఏర్పడటంతో కిలో చికెన్‌ ధర రూ.190-250కు చేరుకుంది. ఈ పరిస్థితులను గమనించిన ఇంటిగ్రేషన్‌ కంపెనీలు కోడిపిల్లలను పెంచడానికి పోటీలు పడుతున్నాయి. తక్కువ ధరలకే కోడిపిల్లలను సరఫరా చేస్తామని, పెంచడానికి కమీషన్‌ కూడా ఎక్కువగా ఇస్తామని పత్రికల్లో ప్రకటనలను ఇస్తున్నాయంటే రానున్న రోజుల్లో చికెన్‌ వ్యాపారం ఏ విధంగా ఉండబోతోందో అర్థమవుతుంది. కొందరైతే రైతుల ఇళ్లవద్దకెళ్లి ఒప్పందాలను సైతం కుదుర్చుకుంటున్నారు. అయినా కంపెనీలు కోడిపిల్లల్ని ఉత్పత్తి చేసి ఫారాలకు సరఫరా చేయాలంటే కనీసం 45 రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న స్టాకు సరిపోకుంటే చికెన్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రమంత్రి హర్షవర్థన్ సమావేశం

Follow Us
ల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే
ల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే
మనోవేదనలోనూ మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులు..!
మనోవేదనలోనూ మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులు..!
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.లక్షకు రూ.14 లక్షలు..ఇన్వెస్టర్లకు పండగే
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.లక్షకు రూ.14 లక్షలు..ఇన్వెస్టర్లకు పండగే
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు