ఛత్తీస్‌గఢ్ పంట పండింది..! బయటపడ్డ భారీ వజ్రాల గని.. డైమండ్ బ్లాక్‌లో డ్రిల్లింగ్‌కు ఆమోదం!
ఛత్తీస్‌గఢ్ ఖనిజ సంపద ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. రాష్ట్రంలో భారీ వజ్రాల గని ఉనికి చాటుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌ఎమ్‌డిసి-సిఎమ్‌డిసి లిమిటెడ్ (NCL) డైరెక్టర్ల బోర్డు సమావేశంలో, మహాసముంద్ జిల్లాలోని 'బలోడా-బెల్ముండి' డైమండ్ బ్లాక్‌లో డ్రిల్లింగ్‌ను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న అసలైన వజ్ర నిల్వలను శాస్త్రీయంగా అంచనా వేయడానికి, భవిష్యత్తులో వాణిజ్యపరంగా తవ్వకాలు జరపడానికి ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుంది.

ఛత్తీస్‌గఢ్ ఖనిజ సంపద ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. రాష్ట్రంలో భారీ వజ్రాల గని ఉనికి చాటుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌ఎమ్‌డిసి-సిఎమ్‌డిసి లిమిటెడ్ (NCL) డైరెక్టర్ల బోర్డు సమావేశంలో, మహాసముంద్ జిల్లాలోని ‘బలోడా-బెల్ముండి’ డైమండ్ బ్లాక్‌లో డ్రిల్లింగ్‌ను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న అసలైన వజ్ర నిల్వలను శాస్త్రీయంగా అంచనా వేయడానికి, భవిష్యత్తులో వాణిజ్యపరంగా తవ్వకాలు జరపడానికి ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుంది.
NCL సంస్థ ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రవాహ అవక్షేప నమూనాల సేకరణ, భూభౌతిక సర్వేలు, లక్షిత డ్రిల్లింగ్ ద్వారా వజ్రాలు లభించే ‘కింబర్లైట్ పైపు’ను గుర్తించింది. ఇక్కడి నుండి సేకరించిన సుమారు 200 టన్నుల భారీ నమూనాను మధ్యప్రదేశ్‌లోని ఎన్‌ఎమ్‌డిసి ‘పన్నా డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్’లో పరీక్షించగా.. 1.22 క్యారెట్ల బరువున్న ఐదు సహజ వజ్రాలు లభించాయి. దీంతో ఇక్కడ వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. కెనడా, ఆస్ట్రేలియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా వంటి అంతర్జాతీయ దేశాల అనుభవాల ప్రకారం.. ప్రారంభంలో ఇలాంటి ఫలితాలు వస్తే, భవిష్యత్తులో అక్కడ భారీ వాణిజ్య నిల్వలు బయటపడే అవకాశం ఉంది. అందువల్ల ఈ ప్రాజెక్టును దేశంలోనే అత్యంత కీలకమైన ఖనిజ ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NMDC లిమిటెడ్, ఛత్తీస్‌గఢ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఏర్పడిన జాయింట్ వెంచరే ఈ NCL. ఇప్పటివరకు కేవలం ఇనుప ఖనిజ ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టింది ఈ సంస్థ. ఇప్పుడు బహుళ-ఖనిజ అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వజ్రాల గనితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఇనుప ఖనిజ ప్రాజెక్టులను కూడా సమీక్షించారు. బైలాడిల డిపాజిట్-4లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, దీనిని క్రమంగా ఏటా 70 లక్షల టన్నులకు పెంచనున్నారు. అలాగే బైలాడిల డిపాజిట్-13లో ఏటా 100 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
గనుల తవ్వకాల్లో పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ పద్ధతులు, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణతో పాటు స్థానిక గిరిజన, గ్రామీణ ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని బోర్డు పునరుద్ఘాటించింది. ఈ వజ్రాల అన్వేషణ విజయవంతమైతే ఛత్తీస్‌గఢ్ ఆదాయం విపరీతంగా పెరగడమే కాకుండా, స్థానికులకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
