Corona Virus: ‘జూ’లో కరోనా వైరస్ కల్లోలం.. ఏడు పక్షులు, సింహం ఆకస్మికంగా మృతి.. ఎక్కడంటే..
Chennai Vandalur Zoo: తమిళనాడులోని వండలూరు జూ లో కోవిడ్లో కలకలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి జంతువులు, పక్షులు మృత్యువాత..
Chennai Vandalur Zoo: తమిళనాడులోని వండలూరు జూ లో కోవిడ్లో కలకలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి జంతువులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వండలూరు జంతుప్రదర్శన శాలలో కరోనా సోకి ఇప్పటికే తొమ్మిది నిప్పుకోళ్లు మృతి చెందగా.. తాజాగా ఒక ఆడ సింహం మరణించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
చెన్నైలోని వండలూర్ జంతుప్రదర్శనశాలగా ప్రసిద్ధి చెందిన అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో ఉష్ట్రపక్షులు ఆకస్మికంగా మరణించడంతో ఎన్‌క్లోజర్ల పర్యవేక్షణను జూ అధికారులు వేగవంతం చేశారు. వైద్య అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఈ వైరస్ మిగిలినవాటిపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం (అక్టోబర్ 27న) ఐదు నిప్పుకోళ్లు మృతి చెందాయి. వీటి నమూనాలు పరీక్షల నిమిత్తం పంపించారు. ఇంతలో మరో రెండు నిప్పుకోళ్లు మరణించాయి. ఇదే సమయంలో గతంలో కరోనా బారిన పడి కోలుకున్న 19 ఏళ్ల కవిత అనే ఆడ సింహం వృద్ధ్యాప సంబంధిత వ్యాధులతో మరణించిందని జూ అధికారులు చెప్పారు. వరసగా పక్షులు, జంవుతులు అనారోగ్యంతో మరణించడంతో ఈ భయం మరింత పెరిగింది. ఈ క్రమంలో అధికారులు ఇతర వన్య ప్రాణులు అనారోగ్యం బారిన పడకుండాముందు జాగ్రత్తలు చేపట్టారు.
Also Read: వెదురు దీపాలను, కొవ్వొత్తులను ఎంచుకోండి .. మనదేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించండి