
‘ఇంట్లో ఉండి నెలకు వేల్లో వేలు సం పాదించాలనుకుంటున్నారా..?’… ‘మీ ఇంట్లో ఉండి పనిచేసే అవకాశం..లక్షల్లో జీతం’..ఇలాంటి ప్రకటనలు కుప్పలు, తెప్పలుగా చూస్తున్నాం. ఉత్త పుణ్యానికి ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎవరిస్తారండీ..కాస్త మైండ్ పెట్టి ఆలోచించిండి. అది ఎంత చీటింగో అర్థమవుతుంది. సెక్యూరిటీ గార్డు జాబ్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఇలా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయంటూ… వివిధ పత్రికలల్లో ప్రకటనలు ఇచ్చిన ఓ వ్యక్తి.. దాదాపు 1500 మందిని మోసం చేశాడు.
చాలా మంది అతడు ప్రచారం చేసిన జీతం, ఉద్యోగాలకు ఆకర్షితులై సంప్రదించగా.. సంబంధిత డాక్యుమెంట్స్‌తో పాటు, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ల జీరాక్స్‌లను తీసుకుని, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000 నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేసేవాడు. దాదాపు 1500 మంది నుంచి దాదాపు రూ.25 లక్షల పైగా దండుకున్నాడు. అంతేకాకుండా పక్కా ప్లానింగ్ ప్రకారం బాధితులు ఇచ్చిన జిరాక్స్ కాపీలతో దాదాపు 5 బ్యాంక్ అకౌంట్లు తెరిచి… అందులో నిరుద్యోగులు పంపే డబ్బు జమ చేసుకున్నాడు. ఇటీవల ఈ వ్యవహారంపై కంప్లైంట్ అందడంతో సైబరాబాద్ పోలీసులు ఈ మోసగాడిపై నజర్ పెట్టి గాలిస్తున్నారు.
Also Read :
అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్దీప్ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్
రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన