AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day 2021: రిపబ్లిక్ డే వేడుకలకు తప్పని కరోనా ఆంక్షలు.. పరేడ్‌లో మార్పులు చేసిన రక్షణ శాఖ..

Changes In Republic Day Parade: అన్ని రకాల వేడుకలపై ప్రభావం చూపుతోన్న కరోనా మహమ్మారి గణతంత్ర వేడుకలపై కూడా ప్రభావాన్ని చూపనుంది. దేశంలో రెండో వేవ్, బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 2021 రిపబ్లిక్ డే పరేడ్‌లో కేంద్రం మార్పులు తీసుకురానుంది.

Republic Day 2021: రిపబ్లిక్ డే వేడుకలకు తప్పని కరోనా ఆంక్షలు.. పరేడ్‌లో మార్పులు చేసిన రక్షణ శాఖ..
Narender Vaitla
|

Updated on: Dec 30, 2020 | 7:18 PM

Share

Changes In Republic Day Parade: అన్ని రకాల వేడుకలపై ప్రభావం చూపుతోన్న కరోనా మహమ్మారి గణతంత్ర వేడుకలపై కూడా ప్రభావాన్ని చూపనుంది. దేశంలో రెండో వేవ్, బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 2021 రిపబ్లిక్ డే (జనవరి 26) పరేడ్‌లో కేంద్రం మార్పులు తీసుకురానుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌ విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. సాధారణంగా 8.2 కిలోమీటర్ల దూరం ఉండే పరేడ్‌ను ఈసారి 3.3 కిలోమీటర్లకే పరిమితం చేయనున్నారు. అంతేకాకుండా పరేడ్‌లో పాల్గొనే వారంతా కచ్చితంగా మాస్కులు ధరించాలి. ఇక పరేడ్‌లో పాల్గొనే బృందాల్లో ఉండే సభ్యుల సంఖ్యను 144 నుంచి 96కు తగ్గించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలను చూడటానికి కేవలం 25 వేల మందికే అనుమతించనున్నారు. అలాగే 15 ఏళ్లులోపు వయసున్న వారికి అనుమతి నిరాకరించారు. Also Read: Electric Buses: 150 ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్డర్‌ చేసిన పుణె మహానగర పరివహన్‌ మహామండల్‌