చంద్రయాన్ 2కు ‘నాసా’ సాయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్ 2’ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. జూలై 15న శ్రీహరికోటలోని షార్ నుంచి తెల్లవారుజామున 2.51గంటలకు ఈ ప్రయోగాన్ని చేయనుంది ఇస్రో. కాగా ఈ ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సాయం చేస్తున్నట్లు ఇస్రో చీఫ్ శివన్ వెల్లడించారు. చంద్రయాన్ 2 నుంచి మొత్తం 14 పేలోడ్స్‌ను చంద్రుడి మీదకు తీసుకెళ్తుండగా.. అందులో నాసా తయారు చేసిన ఒక పేలోడ్‌ ఉందని ఆయన పేర్కొన్నారు. […]

చంద్రయాన్ 2కు ‘నాసా’ సాయం
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 3:55 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్ 2’ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. జూలై 15న శ్రీహరికోటలోని షార్ నుంచి తెల్లవారుజామున 2.51గంటలకు ఈ ప్రయోగాన్ని చేయనుంది ఇస్రో. కాగా ఈ ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సాయం చేస్తున్నట్లు ఇస్రో చీఫ్ శివన్ వెల్లడించారు. చంద్రయాన్ 2 నుంచి మొత్తం 14 పేలోడ్స్‌ను చంద్రుడి మీదకు తీసుకెళ్తుండగా.. అందులో నాసా తయారు చేసిన ఒక పేలోడ్‌ ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇక విక్రమ్ లాండర్‌తో పాటు చంద్రుడి మీద అడుగెట్టనున్న ఈ పేలోడ్ భూమి నుంచి చంద్రుడి మధ్య గల దూరాన్ని తెలియజేయనుందని.. అలాగే చంద్రుడిపై కచ్చితమైన స్థానంలో ల్యాండర్ ల్యాండ్ అయ్యేందుకు సహకరిస్తుందని పేర్కొన్నారు. చాలా సంవత్సరాలు ఈ పేలోడ్ చంద్రుడిపై సేవలు చేయనుందని.. అది అందించే సమాచారాన్ని తమతో కూడా పంచుకుంటామని నాసా అధికారులు తెలిపారు. అలాగే చంద్రయాన్ 2 మిషన్‌‌ను నాసాకు చెందిన డీప్ స్పేష్ సెంటర్‌ నుంచి పర్యవేక్షిస్తామని వెల్లడించారు.