మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ
ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకొన్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సీనియర్ నటుడు మురళీమోహన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆయనను కలిసి.. ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌తో చంద్రబాబు నాయుడు కాసేపు ముచ్చటించారు. మరోవైపు మురళీమోహన్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్‌లో పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని కనుగొన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా […]
ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకొన్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సీనియర్ నటుడు మురళీమోహన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆయనను కలిసి.. ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌తో చంద్రబాబు నాయుడు కాసేపు ముచ్చటించారు. మరోవైపు మురళీమోహన్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్‌లో పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని కనుగొన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా మురళీమోహన్‌ను కలిసిన విషయం తెలిసిందే.