జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు దూరం
ఏపీ నూతన సీఎంగా గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే తమ పార్టీ తరఫున వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను అభినందించేందుకు ముగ్గురు టీడీపీ నేతలకు చంద్రబాబు అనుమతించారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లు జగన్ ఇంటికి […]
ఏపీ నూతన సీఎంగా గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే తమ పార్టీ తరఫున వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను అభినందించేందుకు ముగ్గురు టీడీపీ నేతలకు చంద్రబాబు అనుమతించారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లు జగన్ ఇంటికి వెళ్లనున్నారు. కాగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసిన విషయం తెలిసిందే.