నాకు శాలువలు వద్దు.. పుస్తకాలు బెటర్ : కిషన్ రెడ్డి
బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానమున్న ఆయన మరింత వినూత్నంగా ఆలోచించారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఇటీవలే గెలుపొందిన ఆయన.. తనను అభినందించేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ కొత్త సూచన చేశారు. శాలువలు, పూలగుచ్ఛాలు కాకుండా పుస్తకాలు తీసుకురమ్మని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ బుక్స్ తేవాలని కోరారు. ఆయన […]

బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానమున్న ఆయన మరింత వినూత్నంగా ఆలోచించారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఇటీవలే గెలుపొందిన ఆయన.. తనను అభినందించేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ కొత్త సూచన చేశారు. శాలువలు, పూలగుచ్ఛాలు కాకుండా పుస్తకాలు తీసుకురమ్మని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ బుక్స్ తేవాలని కోరారు. ఆయన విజ్ఞప్తికి అనూహ్య స్పందన వస్తోంది. విజ్ఞప్తి చేసిన కొద్ది సమయంలోనే వేల పుస్తకాలు జమ అయ్యాయి. ఇందుకు వారందరికీ కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలలు మళ్లీ తెరిచాక వీటిని విద్యార్థులందరికీ పంచుతామని కిషన్ రెడ్డి చెప్పారు.