జనభేరి సభకు హాజరయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతి భూమి పూజ జరిగిన చోట సాష్టాంగ నమస్కారం

అమరావతిలో జనభేరి సభకు హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. అంతకముందు ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.

జనభేరి సభకు హాజరయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతి భూమి పూజ జరిగిన చోట సాష్టాంగ నమస్కారం

Edited By:

Updated on: Dec 17, 2020 | 2:53 PM

అమరావతిలో జనభేరి సభకు హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. అంతకముందు ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవతల రాజధాని అయిన అమరావతిని కాపాడాలంటూ దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఏడాది పాటు పూర్తయిన ఉద్యమాన్ని దుర్గమ్మ చూస్తూనే ఉందని, న్యాయం చేస్తుందన్నారు.  ప్రజారాజధాని అమరావతి అందరికల అన్న చంద్రబాబు.. దానిని విధ్వంసం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఎన్నో విధాలుగా దాడులు చేసినా అమరావతిని కాపాడుకునేందుకు ఏడాదిగా పోరాడుతున్నారని అన్నారు.

తొలుత టెన్షన్..టెన్షన్ :

ఉద్దండరాయునిపాలెం వెళ్లుతున్న తెదేపా అధినేత చంద్రబాబును.. వెలగపూడి వద్ద పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. పోలీసులతో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ చర్చలు జరిపిన అనంతరం.. ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రదేశాన్ని చంద్రబాబు సందర్శించి.. అనంతరం రాయపూడి సభకు చేరుకున్నారు.

Also Read : 

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం