Chandrababu vs Jagan: ఎవడబ్బ సొమ్మని భూములు గుంజుకుంటున్నారు..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. కుప్పం పర్యటనలో వున్న చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీవ్రంగా తప్పుపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఒకరకంగా ఆయన కుప్పంలో శ్రీకారం చుట్టారు.
Chandrababu questions AP CM Jagan: రెండోరోజు కుప్పం పర్యటనను కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై నిప్పులు చెరిగారు. ఇంటి స్థలాల కోసం అసైన్మెంటు భూములను తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఎవడబ్బ సొమ్మని పేదల భూములు లాక్కుంటున్నారంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు చంద్రబాబు.
కుప్పం మండలం కంగుందిలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర మంగళవారం కొనసాగింది. ‘‘ఇంటి స్థలాల కోసం అసైన్మెంట్ భూములు లాక్కొంటున్నారు. ఎవడబ్బసొమ్మని పేదల భూములు లాక్కుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలంతా ఎండగట్టాలి. నాకు అధికారం అవసరం లేదు. కానీ ప్రజలందరిలో చైతన్యం రావాల్సి ఉంది..’’ అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
అందుకే ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చిన చంద్రబాబు తన రాజకీయ జీవితంలో 11 మంది ముఖ్యమంత్రులకు చూశానని, కానీ జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని వ్యాఖ్యానించారు. సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే నన్న చంద్రబాబు, విద్యార్థులకు అన్ని సౌకర్యాలను తీసివేసారని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండా.. జగనన్న వసతి దీవెన అంటున్నారని విమర్శించారు. వసతి దీవెన కాదు అది వంచన దీవెన అంటూ కామెంట్ చేశారాయన.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించమని చంద్రబాబు పిలుపునిచ్చారు. పంచాయతీల్లో అధికారంలోకి వచ్చాక భవనాలకు వేసిన రంగులన్నీ మార్చేస్తామని ఆయన ప్రకటించారు.
Read this: World Bank appreciates Jagan government జగన్ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు ప్రశంస