ఫిబ్రవరి నెలలోనే ’29వ రోజు’ ఎందుకంటే!
ఈ 'లీప్ ఇయర్(లీపు సంవత్సరం) ఎలా వచ్చిందంటే.. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు..
2020 సంవత్సరం ఒక ‘లీప్ ఇయర్’.. అంటే ఫిబ్రవరి నెలలో 28కి బదులుగా 29 రోజులు, మొత్తం రోజుల సంఖ్య 365కు బదులుగా 366గా ఉంటుంది. అసలు ఫిబ్రవరి నెలలోనే 29వ రోజు ఎందుకు? ఈ డౌంట్ అందరికీ వచ్చే ఉంటుంది. మాములుగా ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఏడాది లీప్ ఇయర్ కావడంతో 2020 ఫిబ్రవరి నెలలలో 29 రోజులు వచ్చాయి.
పూర్తి వివరంగా.. ఈ ‘లీప్ ఇయర్(లీపు సంవత్సరం) ఎలా వచ్చిందంటే.. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. అంటే 365 రోజులతో పాటు పావు రోజు పడుతుంది. పావు రోజును.. రోజుగా తీసుకోలేం కాబట్టి ప్రతీ నాలుగేళ్లల్లో నాలుగు పావు రోజుల్ని కలిపి.. ఒక రోజుగా పెట్టారు’. కాబట్టి లీప్ ఇయర్‌లో మరొక రోజు అదనంగా వస్తుంది. అయితే ఈ సూర్యుని భ్రమణం ఫిబ్రవరి నెల 28కి ముగుస్తుంది. కాబట్టి ఆ తర్వాతి రోజును 29గా పెట్టారు. మళ్లీ మార్చి నుంచి సూర్యుడి భ్రమణం మొదటి నుంచి మొదలవుతుంది. ఇదీ ఫిబ్రవరిలోని 29వ రోజు కథ. కాగా.. ఈ లీపు సంవత్సరం 2016లో వచ్చింది. మళ్లీ ఇది 2024లో వస్తుంది.