అమ్మకంలో స్టార్ట్ ఫోన్ల కన్నా.. స్మాల్ ఫోన్లే మిన్న

స్మార్ట్ ఫోన్ల కన్నా.. స్మాల్ ఫోన్లే (బేసిక్ ఫోన్లు) అమ్మకంలో టాప్‌లో ఉన్నాయట. ఏంటి ఈ విషయం విని షాక్ అవుతున్నారా. ఇదే విషయంపై ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ సంస్థ..

అమ్మకంలో స్టార్ట్ ఫోన్ల కన్నా.. స్మాల్ ఫోన్లే మిన్న
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 25, 2020 | 12:31 PM

స్మార్ట్ ఫోన్ల కన్నా.. స్మాల్ ఫోన్లే (బేసిక్ ఫోన్లు) అమ్మకంలో టాప్‌లో ఉన్నాయట. ఏంటి ఈ విషయం విని షాక్ అవుతున్నారా. ఇదే విషయంపై ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

ప్రస్తుతం అరచేతిలోనే ప్రపంచం మొత్తం దర్శనమిస్తోంది. అందులోనూ స్మార్ట్ ఫోన్లుంటే.. సొంతంగా బిజినెస్‌లు కూడా మొదలు పెడుతున్నారు. ఇన్ని రకాలుగా.. సేవలందిస్తున్నా కూడా.. ఫీచర్ ఫోన్ల(బేసిక్ మోడళ్లు)పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారట. దాదాపు దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగానే మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తుండగా.. అందులో 45 కోట్ల మంది ఫీచర్ ఫోన్లనే వాడుతున్నారట. అంటే ఈ లెక్కన స్మార్ట్ ఫోన్లను ఉపయోగించేది కేవలం 35 కోట్ల మందే. మహా అయితే గత మూడేళ్ల నుంచి మాత్రమే టచ్ స్క్రీన్ ఫోన్‌ల వినియోగం వాడకంలోకి వచ్చింది.

అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఉన్నందున దాన్ని ఎలా ఉపయోగించాలో అవగాహన లేకపోవడం, గ్రామాల్లో ఉన్నవారికి, నిర్లక్ష్యరాసులకు, స్మార్ట్ ఫోన్లలో ఫీచర్లు అర్థం కాక, ఇంటర్నెట్‌ తెలియకపోవడం వంటి కారణాల వల్ల బేసిక్ మోడళ్లనే ఉపయోగిస్తున్నట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) సంస్థ అధ్యయనం చేసింది. అందులోనూ స్మార్ట్ ఫోన్ల ధరలకంటే.. బేసిక్ మోడల్స్ ధరలు చాలా చౌకగా లభించడం ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు.