కశ్మీర్‌పై కేంద్రానికి గడువు: సుప్రీం

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షల్ని సడలించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం దీనిపై వాదనలు స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని రకాల ఆంక్షల్ని విధించారని పిటిషనర్‌ తెహసీన్‌ పూనవాల ధర్మాసనానికి తెలిపారు. దీంతో అరుణ్‌ మిశ్రా అక్కడి పరిస్థితుల్ని అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకీ అక్కడ పరిస్థితులు మెరుగవుతున్నాయని.. ప్రశాంత వాతావరణానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని వేణుగోపాల్‌ వివరించారు. క్రమంగా ఆంక్షలు సడలించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. […]

కశ్మీర్‌పై కేంద్రానికి గడువు: సుప్రీం
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 6:02 PM

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షల్ని సడలించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం దీనిపై వాదనలు స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని రకాల ఆంక్షల్ని విధించారని పిటిషనర్‌ తెహసీన్‌ పూనవాల ధర్మాసనానికి తెలిపారు. దీంతో అరుణ్‌ మిశ్రా అక్కడి పరిస్థితుల్ని అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకీ అక్కడ పరిస్థితులు మెరుగవుతున్నాయని.. ప్రశాంత వాతావరణానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని వేణుగోపాల్‌ వివరించారు. క్రమంగా ఆంక్షలు సడలించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. 2016లో మూడు నెలలు కఠిన ఆంక్షలు విధించారని.. దాదాపు 47 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ప్రస్తుతం అలాంటి ప్రాణనష్టం ఏమీ సంభవించలేదని స్పష్టం చేశారు.

త్వరలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అటార్నీ జనరల్‌ ధర్మాసనానికి వివరించారు. అక్కడ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు విద్య, వైద్యం లాంటి కనీస వసతులను అందుబాటులో ఉంచామని తెలిపారు. అక్కడి జిల్లాల్లో పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. అటార్నీ జనరల్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి సమయం ఇవ్వాలని నిర్ణయించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది

Latest Articles
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి