AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్-19 కొత్త గైడ్ లైన్స్ ని ప్రకటించిన కేంద్రం, కంటెయిన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఇంకా కఠినం !

కోవిడ్-19 నూతన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి వీటిని ఆయా రాష్ట్రాలు, ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వీటిని పాటించాలని..

కోవిడ్-19 కొత్త గైడ్ లైన్స్ ని ప్రకటించిన కేంద్రం, కంటెయిన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఇంకా కఠినం !
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 25, 2020 | 6:36 PM

Share

కోవిడ్-19 నూతన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి వీటిని ఆయా రాష్ట్రాలు, ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వీటిని పాటించాలని సూచించింది. కంటెయిన్మెంట్ జోన్లలో ఆంక్షలు మరింత కఠిన తరం చేయాలని,  కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటించని వారికి   జరిమానాలు రెట్టింపు చేయాలని, కరోనా వైరస్ ని సాధ్యమైనంత వరకు అదుపు చేసేలా నడవడికను అలవరచుకోవాలని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ కేసులు 92 లక్షలకు పైగా పెరిగిపోవడంతో కేంద్ర హోమ్ శాఖ తాజాగా  గైడ్ లైన్స్ ని విడుదల చేయడం విశేషం. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోవడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఇక రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్ఛే నెల 1 నుంచి రాత్రి వేళ కర్ఫ్యూ విదించనున్నారు. అలాగే మాస్కులు ధరించనివారికి జరిమానాను వెయ్యి రూపాయలు పెంచనున్నారు. ఇక మార్కెట్లు, బజార్లకు సంబంధించి కేంద్రం వేరుగా గైడ్ లైన్స్ జారీ చేసే యోచనలో ఉంది.

ప్రపంచంలో ఇప్పుడు రెండో అతి పెద్ద కోవిడ్ హిట్ దేశంగా ఇండియా మారింది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినవారి సంఖ్య లక్షా 34 వేలకు చేరిందని ప్రభుత్వ వర్గాల అంచనా. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు అయిదున్నర లక్షలకు పెరిగాయి.

Follow Us
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?