AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ట్రీట్మెంట్ : తెలంగాణలో ప్లాస్మా థెరపీకి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్…

కరోనా పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ ఓ ఆశాదీపంలా మారింది. కరోనాతో బాధపడుతూ సీరియస్‌ కండిషన్‌లో ఉన్న పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ కచ్చితంగా పని చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. మన దగ్గరే కాదు, బయట దేశాల్లోనూ దీన్ని అమలు చేస్తున్నారు. కేరళలో సైతం ప్రక్రయ మొదలయ్యింది. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. తెలంగాణలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతిని ఇచ్చింది. కరోనా బాధితులలో ఆరోగ్యం విషమించిన వారికి ప్లాస్మా థెరపీని అందిస్తారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్లాస్మా […]

క‌రోనా ట్రీట్మెంట్ : తెలంగాణలో ప్లాస్మా థెరపీకి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 25, 2020 | 3:03 PM

Share

కరోనా పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ ఓ ఆశాదీపంలా మారింది. కరోనాతో బాధపడుతూ సీరియస్‌ కండిషన్‌లో ఉన్న పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ కచ్చితంగా పని చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. మన దగ్గరే కాదు, బయట దేశాల్లోనూ దీన్ని అమలు చేస్తున్నారు. కేరళలో సైతం ప్రక్రయ మొదలయ్యింది. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. తెలంగాణలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతిని ఇచ్చింది. కరోనా బాధితులలో ఆరోగ్యం విషమించిన వారికి ప్లాస్మా థెరపీని అందిస్తారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్లాస్మా థెరపీకి ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

ఇప్పటికే ఢిల్లీలో ఓ పేషెంట్‌పై ప్రయోగాత్మకంగా అమలుచేసి విజయవంతమయ్యారు. మాక్స్ ఆస్పత్రి వైద్యులు ప్లాస్మా థెరపీ చేయడంతో కోవిడ్ రోగి కోలుకున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోనూ ప్లాస్లా థెరపీ చికిత్స భారత వైద్య పరిశోధనా మండలి అనుమతిచ్చింది. త్వరలోనే ఇక్కడ ప్లాస్మా థెరపీ విధానంలో ఎంపిక చేసిన రోగులకు చికిత్స అందించనున్నారు. రక్తంలో నీటి రూపంలో కనిపించే పసుపు రంగు ద్రవమే ప్లాస్మా. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే యాంటీబాడీలు ఇందులో ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాలో వైరస్‌ను చంపే యాంటీబాడీలు ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్ కణాలను తెల్లరక్తకణాలు గుర్తించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను తయారుచేస్తుంది. అవి వైరస్ కణాలకు అతుక్కున్న తర్వాత వైరస్ కణాలను తెల్లరక్తకణాలు గుర్తించి నాశనం చేస్తాయి. అందుకే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను తీసి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రోగులకు ఎక్కిస్తారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆస్పెరిసిస్ విధానం ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. మిగతా రక్త కణాలు మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. ఒక దాత నుంచి 800 మిల్లిలీటర్ల వరకు ప్లాస్మా తీయవచ్చు. అయితే ఒక్కో కరోనా రోగికి 200 మిల్లీలీటర్ల ప్లాస్మా అవసరం పడుతుంది. అలా ఒక్క వ్యక్తి ద్వారా నలుగురు కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!