జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గినందుకు టీఆర్‌ఎస్‌ దే బాధ్యత : కిషన్ రెడ్డి

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గడానికి కారణం అధికార టీఆర్ఎస్ పార్టీనే అంటున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంతేకాదు, దీనికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం..

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గినందుకు టీఆర్‌ఎస్‌ దే బాధ్యత : కిషన్ రెడ్డి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 02, 2020 | 11:01 AM

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గడానికి కారణం అధికార టీఆర్ఎస్ పార్టీనే అంటున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంతేకాదు, దీనికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని కూడా ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్‌ శాతం తగ్గిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరిపి ప్రభుత్వం వారిని అవమానించిందన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూశారని, కానీ పోలింగ్‌ సరళి చూశాక గెలుస్తామనే విశ్వాసం కలిగిందని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.