ముగిసిన తుంగభద్ర పుష్కరాలు.. వేదపండితులు వేద మంత్రాలతో హారతులిచ్చి ముగింపు

తుంగభద్ర పుష్కరాలు ముగిశాయి. 12 రోజులపాటు నదిలో పుణ్య పుష్కర స్నానాలు ఆచరించిన ప్రజలు చివరి రోజు కావడంతో మరింతమంది ఉత్సాహంతో స్నానమా..

  • Venkata Narayana
  • Publish Date - 4:33 am, Wed, 2 December 20
ముగిసిన తుంగభద్ర పుష్కరాలు.. వేదపండితులు వేద మంత్రాలతో హారతులిచ్చి ముగింపు

తుంగభద్ర పుష్కరాలు ముగిశాయి. 12 రోజులపాటు నదిలో పుణ్య పుష్కర స్నానాలు ఆచరించిన ప్రజలు చివరి రోజు కావడంతో మరింతమంది ఉత్సాహంతో స్నానమాచరించారు. వేదపండితులు వేద మంత్రాలతో తుంగభద్రా నదికి హారతులిచ్చి ముగింపు పలికారు. కర్నూలు, జిల్లాలోని మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గంలోని గుండ్రేవుల పుష్కర్ ఘాట్ వద్ద భారీగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నవంబర్‌ 20న పీఠాధిపతుల ప్రత్యేక పూజలు, మంత్రుల పుష్కర స్నానంతో ప్రారంభమైన ఉత్సవాలు.. మంగళవారం సాయంత్రం వేద పండితుల నదీహారతితో పూర్తయ్యాయి. అటు, తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలోని అలంపూర్‌, పుల్లూరు, రాజోలి, వేణిసోంపురం వద్ద భారీగా భక్తులు పుష్కర స్నానాలు చేసి హారతులిచ్చారు.