ఓటమే విజయానికి నాంది – కిషన్ రెడ్డి

2014 ఎన్నికల్లో అంబర్ పేట్ ను ఓటమిపాలై.. సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే నియోజకవర్గం నుంచి గెలిచి.. కేంద్రమంత్రి అవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకూడదని.. ఓటమిని అధిగమించి ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. గతంలో తనను ఎమ్మెల్యేగా ప్రజలు కాదన్నారని.. దాన్ని తాను అంగీకరించానని.. ఆ తర్వాత ఐదేళ్లకు అదే ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని.. ఇప్పుడు కేంద్రమంత్రి హోదా […]

ఓటమే విజయానికి నాంది - కిషన్ రెడ్డి
Follow us

|

Updated on: Jun 03, 2019 | 10:34 AM

2014 ఎన్నికల్లో అంబర్ పేట్ ను ఓటమిపాలై.. సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే నియోజకవర్గం నుంచి గెలిచి.. కేంద్రమంత్రి అవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకూడదని.. ఓటమిని అధిగమించి ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. గతంలో తనను ఎమ్మెల్యేగా ప్రజలు కాదన్నారని.. దాన్ని తాను అంగీకరించానని.. ఆ తర్వాత ఐదేళ్లకు అదే ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని.. ఇప్పుడు కేంద్రమంత్రి హోదా ఇచ్చారని చెప్పారు. ఇలా తనను ఆదర్శంగా తీసుకుని ఇంటర్ విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించుకోవాలని ఆయన సూచించారు. దేశంలో శాంతిభద్రతల పట్ల బీజేపీ ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల అపరిష్కృత సమస్యలపై కిషన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన మాటల్లోనే..