కొత్త వాహనాల కొనుగోలుదారులకు త్వరలో శుభవార్త

టూ వీలర్ కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది.  కొత్తగా ద్విచక్ర వాహన కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఊరట లభించనుంది. ఈ అంశంపై ఓ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు...

కొత్త వాహనాల కొనుగోలుదారులకు త్వరలో శుభవార్త
Sanjay Kasula

|

Aug 27, 2020 | 8:42 PM

టూ వీలర్ కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది.  కొత్తగా ద్విచక్ర వాహన కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఊరట లభించనుంది. ఈ అంశంపై ఓ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ద్విచక్రవాహనాల పరిశ్రమపై అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే  ఓ శుభవార్త వింటారని తెలిపారు.

ఈ నేపథ్యంలో జీఎస్‌టీ (GST) పరిమితిని తగ్గిస్తారని, తద్వారా తక్కువ ధరలకే వాహనాలు లభిస్తాయని, కంపెనీలకు ఎంతో లాభదాయకమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యులకు ఎక్కువగా ఉపయోగపడే ద్విచక్రవాహనాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని  మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం ద్విచక్రవాహనాలకు 28శాతం జీఎస్‌టీ ఉంది. ద్విచక్రవాహనాలకు జీఎస్‌టీ తగ్గుతుందన్న వార్తల నేపథ్యంలో హీరో మోటార్‌ కార్ప్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీల షేర్ల ఒక్కసారిగా 2నుంచి 6శాతం షేర్లు పెరిగాయి. త్వరలో జరగనున్న 41వ జీఎస్‌టీ సమావేశంలో ద్విచక్రవాహనాలపై జీఎస్‌టీ శాతం ఎంత ఉండేది స్పష్టత రావచ్చని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu