AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే పేదలకు సులభంగా లోన్స్..

కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారికి సులభంగా రుణాలు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే పేదలకు సులభంగా లోన్స్..
Ravi Kiran
|

Updated on: Jul 25, 2020 | 3:12 PM

Share

Easy Loans To Poor: కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారికి సులభంగా రుణాలు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆర్బీఐ నుంచి సులభంగా అనుమతులు పొందేలా ఒక నూతన పాలసీని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు.

”సామాజిక సంస్థల నుంచి పేదలకు చిన్న మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందుకు గాను సోషల్ మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్లకు లైసెన్స్ అందిస్తాం. తక్కువ వ్యవధిలో సులభతరంగా పేదలకు రుణాలు ఇవ్వాలంటే.. ఓ కంప్యూటరైజ్ద్ వ్యవస్థ అవసరమవుతుంది. దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాం” అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు..అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..

‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ… కంటతడి పెట్టిన సుశాంత్ యాక్టింగ్..