యరపతినేనిపై సీబీఐ విచారణ!

పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరగబోతోంది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే యరపతినేనితోపాటు మరికొందరిపై 18 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు సీబీఐ విచారణ చేయబోతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లో సున్నపురాతి గనుల తవ్వకాలపై పెద్దయెత్తున ఆరోపణలు వచ్చాయి. అక్రమాల పరిధి ఎక్కువగా ఉండటం, సున్నపురాయి ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో సీబీఐ విచారణ అవసరమని గతంలో అభిప్రాయపడింది హైకోర్టు. ఈ […]

యరపతినేనిపై సీబీఐ విచారణ!
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 9:08 PM

పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరగబోతోంది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే యరపతినేనితోపాటు మరికొందరిపై 18 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు సీబీఐ విచారణ చేయబోతోంది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లో సున్నపురాతి గనుల తవ్వకాలపై పెద్దయెత్తున ఆరోపణలు వచ్చాయి. అక్రమాల పరిధి ఎక్కువగా ఉండటం, సున్నపురాయి ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో సీబీఐ విచారణ అవసరమని గతంలో అభిప్రాయపడింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకుంది. వైసీపీ సర్కార్‌ సైతం అందుకు సిద్ధం కావడంతో సీబీఐ విచారణ జరగబోతోంది.

ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా లక్షల టన్నుల రాయి ఇతర ప్రాంతాలకు తరలిపోయిందన్నది ప్రధాన ఆరోపణ. గతంలోనే దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. యరపతినేని పాత్ర ఉందని తేల్చింది సీఐడీ. కొన్ని బ్యాంక్‌ లావాదేవీలను సైతం గుర్తించడంతో ఈడీ విచారణ సైతం జరిపించాలని CID అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.