కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై కార్లలో హైడ్రోజన్ సీఎన్‌జీనే ఇంధనం.!
హైడ్రోజన్ సీఎన్‌జీ ఇంధనంతో నడిచే కార్లు త్వరలోనే రానున్నాయి. ఈ సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Cars could soon run on Hydrogen CNG: కేంద్ర ప్రభుత్వం సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. హైడ్రోజన్ సీఎన్‌జీ ఇంధనంతో నడిచే కార్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనిపై కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పెట్రోల్, డీజిల్, ఛార్జింగ్ లాంటివి ఇంధనాలు కాకుండా వాహన టైల్‌పైప్ ఉద్గారాలను తగ్గించేందుకు, వాహనదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడే ప్రత్యామ్నాయ వాహన ఇంధనాలను కనుగొనేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను తాజాగా విడుదల చేసింది. హైడ్రోజన్ చోదక వాహనాల భద్రతా మూల్యాంకనం, ప్రమాణాలపై ప్రజలు, షేర్ హోల్డర్స్ నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
భారతదేశంలో సమర్ధమంతమైన ఆటోమోటివ్ ఇంధనంగా తయారు చేయగలిగితే కొత్త ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అనుమతించేందుకు రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వాహన నిబంధనలు 1979లో సవరణ చేయనుంది. హెచ్‌సీఎన్‌జీని ఇంధనంగా తయారు చేయడమే కాకుండా మరింత తేలికగా ఆచరణలోకి తీసుకురావచ్చునని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారత్‌లో ఇప్పటికే అనేక చోట్ల సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉండటమే కాకుండా సమృద్ధిగా వాడుకలోకూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే హైడ్రోజన్ సీఎన్‌జీ కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, హైడ్రోకార్బన్ (టిహెచ్‌సి) ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. సీఎన్‌జీ పైప్‌లైన్‌లలో ఇంధనాన్ని సమాకూర్చేందుకు చిన్న ట్వీక్‌లు అవసరమవుతాయి కాబట్టి, భారత ప్రభుత్వం త్వరలోనే పైలట్ ప్రాజెక్టును అమలు చేయనుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచనుంది.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!
కిమ్ ఇలాకాలో మొదటి కరోనా కేసు.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్..!




