‘ ఇలాంటి పార్టీని ఎవరూ రక్షించలేరు’, శివరాజ్ సింగ్ చౌహాన్

కాంగ్రెస్ పార్టీలో తలెత్తినసంక్షోభంపై మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. సోమవారం ఉదయం నుంచి ప్రారంభమై  ఆ పార్టీలో నిర్విరామంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, ఇలాంటి పార్టీని..

  • Umakanth Rao
  • Publish Date - 4:58 pm, Mon, 24 August 20
' ఇలాంటి  పార్టీని ఎవరూ రక్షించలేరు', శివరాజ్ సింగ్ చౌహాన్

కాంగ్రెస్ పార్టీలో తలెత్తినసంక్షోభంపై మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. సోమవారం ఉదయం నుంచి ప్రారంభమై  ఆ పార్టీలో నిర్విరామంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, ఇలాంటి పార్టీని ఎవరూ రక్షించలేరని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలోని కొందరు సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ.. లోగడ జ్యోతిరాదిత్య సింధియా తన గళాన్ని లేవనెత్తినప్పుడు బీజేపీతో లాలూచీ పడుతున్నారని ఆరోపించారని, ఇప్పుడు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి వారు పూర్తి స్థాయి పార్టీ చీఫ్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. వీరు కూడా బీజేపీతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారని, ఈ విధమైన పార్టీని ఎవరు కాపాడగలరని చౌహన్ ప్రశ్నించారు.

మరో బీజేపీ నేత ఉమాభారతి కూడా కాంగ్రెస్ సంక్షోభంపై స్పందిస్తూ..నెహ్రూ -గాంధీ కుటుంబంలో రాజకీయ ఆధిపత్యం ముగిసిందని, కాంగ్రెస్ పార్టీ కథ ఖతమైనట్టేనని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ మళ్ళీ గాంధీ వద్దకే తిరిగి వెళ్లాలని, ఏ విదేశీ (సోనియా) పోకడా లేని అసలైన  ‘స్వదేశీ’ గాంధీ రావాలని ఆమె ట్వీట్ చేశారు.